మోడీకి లేఖ.. ఒక్క అవకాశం ఇవ్వండి..

 

కాశ్మీర్లో తరచూ సైనికులపై రాళ్ల దాడులు జరగడం చూస్తూనే ఉన్నాం. అంతేకాదు ఇటీవల ఓ జవాను పై కూడా కాశ్మీర్ యువత దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మోడీకి ఓ లేఖ రాశారు గిరిజనులు. బీహార్ లోని జాబువా జిల్లాలోని భిల్ తెగకు చెందిన యువకులు మోడీకి లేఖ రాశారు. "మా రక్తం ఉడుకుతోంది. దేశ రక్షణ కోసం నిత్యం శ్రమిస్తున్న సైనికులపై రాళ్ల దాడులా?... సైనికుల చేతిలో ఆయుధాలున్నా మౌనంగా భరించడమా?....ప్రధాని గారూ! మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. కశ్మీర్ లో అల్లర్లు జరిగినప్పుడు రాళ్లు విసిరే యువకులకు ఎదురుగా మమ్మల్ని నిలబెట్టండి....మాకు ఆయుధాలు వద్దు.... వాళ్లు విసిరే రాళ్లే మాకు చాలు... మరోసారి కశ్మీరీ యువకులు రాళ్లు ముట్టుకుంటే ఒట్టు" అంటూ లేఖ రాశారు. కాగా ఈ తెగకు చెందిన యువకులు ఒడిసెలను ఒడుపుగా ప్రదర్శించడంలో నైపుణ్యం కలవారు. ఒక్కో యువకుడు 50 మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఒడిసెలతో గురితప్పకుండా ఛేదించగలరు. మరి గిరిజనులు రాసిన లేఖ గురించి మోడీ ఒకసారి ఆలోచిస్తే బావుంటుంది..