TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ముస్లిం విద్యార్ధికి మోడీ సాయం...

Published on: Thu Mar 23, 2017 11:31AM

 

ప్రధాని నరేంద్ర మోడీ ఓ ముస్లిం విద్యార్ధికి అండగా నిలిచారు. దీంతో ఆ విద్యార్ధి జీవితమే మారిపోయింది. ఇంతకీ మోడీ ఏం చేశారో చూద్దాం... కర్ణాటకలోని మండ్యా జిల్లా షుగర్ టౌన్ ప్రాంతానికి చెందిన బీబీ సారా అనే విద్యార్ధి ఉన్నత చదువులు చదవాలని అనుకుంది. అయితే వారి కుటుంబ ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండటంతో ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలని అనుకుంది. దీనిలోభాగంగానే ఆమె లోన్ కోసం అన్నిబ్యాంకులు తిరిగింది కానీ.. ఎక్కడ పని జరగలేదు. దీంతో తనకు ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాసింది. దీంతో లేఖకు స్పందించిన మోడీ వెంటనే ఆమెకు లోన్ ఇప్పించాలంటూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రధాని నుంచి ఆదేశాలు అందాయి. అంతే సాక్ష్యాత్తు మోడీ చెప్పిన తరువాత పని జరగకుండా ఉంటుందా..  ఆమెకు ఆగమేఘాల మీద లోన్ మంజూరయింది. విజయాబ్యాంకు ఆమెకు రూ. 1.5 లక్షల విద్యా రుణం మంజూరు చేసింది. ఇక మోడీ చేసిన సహాయానికి ఆ విద్యార్థి మాట్లాడుతూ..  ప్రధాని తన సమస్య పట్ల స్పందిస్తారనే తాను భావించానని... అయితే, ఇంత తొందరగా స్పందిస్తారని అనుకోలేదని సంతోషం వ్యక్తం చేసింది.