మోడీ ట్వీట్ కు కేజ్రీవాల్ పంచ్...దండోరా వేసుకోము..

Publish Date:Jan 10, 2017


ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేయాలంటే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎప్పుడూ ముందుంటారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ ఏదో ఒక విషయంపై ఆయన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు తాజాగా ఆయనకు దొరికిన మ్యాటర్. ఈరోజు మోడీ చేసిన ట్వీట్. వైబ్రంట్‌ గుజరాత్‌ సమిట్‌లో పాల్గొనటానికి వెళ్లిన మోడీ.. యోగా కి బ్రేక్.. తల్లి హీరాబెన్ కు కలిసేందకు వెళ్లానని.. ఆమెతో కలసి టిఫిన్ చేశానని చెప్పారు.

 

 

దీనిపై కేజ్రీవాల్ స్పందించి..  ‘మా అమ్మ మాతోనే ఉంటారు.. నేను నిత్యం ఆమె ఆశీర్వాదం తీసుకుంటాను. కానీ ఆ విషయాన్ని ఇలా దండోరా వేసుకోను. రాజకీయాల కోసం అమ్మని బ్యాంకు లైన్లో నిలబెట్టను’ అని కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. అంతటితో ఆగకుండా ‘వృద్ధురాలైన తల్లిని, భార్యను తమ దగ్గరే ఉంచుకోవాలని హిందూ ధర్మం, భారతీయ సంస్కృతి చెప్తున్నాయి. ప్రధాని నివాసం చాలా పెద్దది.. హృదయాన్ని కూడా కాస్త విశాలం చేసుకోవాలి’ అని హితవు పలికారు. మరి దీనికి మోడీ ఎలా సమాధానం చెబుతారో చూడాలి.

By
en-us Politics News -