మోడీ.. నిన్న స్వచ్ఛ భారత్.. ఈరోజు స్టాచ్యూ క్లీనింగ్
Published on: Sat Jan 30, 2016 9:31AM

ప్రధాని నరేంద్ర మోడీ కొద్ది నెలల క్రితం స్వఛ్చ భారత్ అంటూ నలుగురి చేత చీపుర్లు పట్టించి మరీ తుడిపించేరు. సామాన్యుల దగ్గర నుండి సెలబ్రిటీల వరకూ అందరూ కాస్తో.. కూస్తో చీపుర్లు పట్టి.. శుభ్రం చేసిన వారు ఉన్నారు. ఇప్పుడు మళ్లీ స్వచ్ఛ భారత్ తరహా మరో నినాదానికి పిలుపు నిచ్చారు మోడీ. అదే "స్టాచ్యూ క్లీనింగ్".స్వాతంత్ర్య సమరయోధులు కావొచ్చు.. రాజకీయ నాయకులు కావొచ్చు.. ప్రముఖులు కావొచ్చు.. ఎవరైనా సరే ఒక గొప్ప వ్యక్తిని స్మరించుకునేందుకు ఏర్పాటు చేసే విగ్రహాలను చక్కగా కడిగి శుభ్రంగా ఉంచాలన్నది తాజాగా మోడీ పిలుపు. అంతేకాదు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని అన్నారు. దీనిలో భాగంగానే ఆయన #statuecleaning పేరుతో ఒక హ్యాష్ టాగ్ ఓపెన్ చేసి ప్రతిఒక్కరూ తాము కడిగి.. శుభ్రపరిచిన విగ్రహాల ఫోటోల్ని పోస్ట్ చేయాలని.. తాను కొన్ని ఫోటోల్ని రీట్వీట్ చేస్తానంటూ మోడీ ప్రకటించారు. మొత్తానికి మొన్నటి వరకూ చీపుర్లు పట్టించిన మోడీ.. ఇప్పుడు చెంబుడు నీళ్లని పట్టిస్తున్నారు.


