ఢిల్లీ ప్రజలకు మోడీ నూతన సంవత్సర కానుక..
Published on: Thu Dec 31, 2015 4:29PM

ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ- మీరట్ ఎక్స్ ప్రెస్ హైవేకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ..ఢిల్లీ- మీరట్ ఎక్స్ ప్రెస్ హైవేను ఢిల్లీ ప్రజలకు నూతన సంవత్సర కానుకగా అందిస్తున్నాని అన్నారు. కాలుష్య రహిత రోడ్డు మార్గంగా హైవేను నిర్మిస్తామని.. హైవేతో వీకెండ్ టూరిజం అభివృద్ధి అవుతుందని అన్నారు. ఎక్స్‌ప్రెస్ హైవే వల్ల ఢిల్లీ శివారు ప్రాంత ప్రజల అభివృద్ధి జరుగుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీ నేషనల్ హైవే-24 ప్రాజెక్టు కోసం రూ. 10,166 కోట్లు ఖర్చు చేయనున్నామని.. మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి కానుందని.. ప్రధాని అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు రవాణా సంబంధాలు ఏర్పడితేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని మోదీ అన్నారు.


