TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సోనియా, రాహుల్ కు మోడీ తేనీటి విందు..

Published on: Fri Nov 27, 2015 2:26PM

ప్రధాని నరేంద్ర మోడీ జీఎస్టీ బిల్లుపై ప్రతిష్ఠంభనలను తొలగించే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఈరోజు సాయంత్రం మోడీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లకు తేనీటి విందును ఇవ్వనున్నారు. ఈసందర్భంగా మోడీ వీరితో జీఎస్టీ బిల్లుపై చర్చించునున్నట్టు తెలుస్తోంది. అయితే తమ అభ్యంతరాలను కనుక తొలగిస్తే బిల్లును ఆమోదించడానికి తాము సిద్దంగా ఉన్నామని రాహుల్ గాంధీ తెలిపారు. మరి వారి అభ్యంతరాలను మోడీ ఎంతవరకూ తీర్చగలరో చూద్దాం.