Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పాపం ఆ తండ్రిని అర్ధం చేసుకోండి ప్లీజ్!
posted on: Jun 3, 2025 2:03PM
.webp)
రాజేంద్రప్రాద్ అభిమాని విన్నపం
రాజేంద్ర ప్రసాద్ ఈ మధ్య తన కూతురు చనిపోయినప్పటి నుంచి ఇలా మారిపోయారా? అంటే అవుననే తెలుస్తోంది. మొన్న రాబిన్ హుడ్ సినిమా ఫంక్షన్లో డేవిడ్ వార్నర్ ని దొ*గ ము*కొడుకు అంటూ కామెంట్ చేసి ట్రోల్ అయ్యారు. ఇప్పుడు చూస్తే.. అలీని, తర్వాత రోజాని అనడం వల్ల హాట్ టాపిక్ అయ్యారు. అలీని అనరాని మాటలు అన్నారన్నది ఒక అభియోగం కాగా.. దాన్ని నేనే హీరోయిన్ చేశానని రోజాను అన్నట్టుగా ఆయన చెప్పుకోవడం తీవ్ర విమర్శల పాలు చేస్తోంది.
ఇదొక మానసిక అవస్థ. ఇన్నాళ్ల పాటు ఎంతో హుందాగా, మరెంతో గౌరవంగా ఉన్న ఒక వ్యక్తి.. నట కిరీటి బిరుదాంకితుడు.. ప్రొడ్యూసర్స్ హీరో, మినిమం గ్యారంటీ హిట్ మేకర్, ఆపై సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ పెద్ద ఎత్తున హిట్స్ ఇచ్చిన వాడైన రాజేంద్ర ప్రసాద్ ఆల్ ఆఫ్ ఏ సడెన్ గా ఇలా మారిపోవడం వెనక ఒక అంతుచిక్కని రహస్యమేదో దాగి ఉందని మీకేమీ అనిపించడం లేదా?
ఆయన తన కూతురి మరణంతో పూర్తిగా దెబ్బ తినేశారు. ఆ భయంకరమైన బాధ- నొప్పి- ఆవేదన నుంచి తనను తాను బయట పడేసుకోడానికి.. ఇలా చేస్తుంటారేమో అంటున్నారు మానసిక నిపుణులు. ఒక మనిషికి ఇదో అవస్థ. ఈ అవస్థ అందరికీ అర్ధమయ్యేది కాదు. కొందరికకి మాత్రమే తెలుస్తుంది. నిజానికి రాజేంద్రప్రసాద్ చేసింది తప్పే.. సరిగ్గా అదే సమయంలో ఆయన అన్నమాటల్లోనూ ఒక నిజముంది. కానీ సభా మర్యాద ప్రకారం చూస్తే అది తప్పు కూడా. ఈ విషయాలన్నిటినీ బేరీజు వేసుకుని చూస్తే.. ఆయన్ను మనం ఒక బాధితుడిగా చూడాలి తప్ప.. నిందితుడిగా బోనులోకి ఎక్కించడం ఎంత వరకూ కరెక్ట్ అన్నదిప్పుడు చర్చనీయాంశంగా మారింది.
చాలా మంది చెప్పడాన్ని బట్టి చూస్తే ఆయన తనకు తెలీకుండా ఒక ఆందోళనకు బందీ. ఆ బందిఖానా నుంచి చెర విముక్తి చేసుకోడంలో భాగంగా తనకు తెలీకుండా ఇలా అయిపోయారు. ఆయన్ను ఆదరించండి తప్ప తక్కువ చేసి చూడొద్దన్న మాట ఒకింత గట్టిగానే వినిపిస్తోంది. మీకు తెలుసో తెలీదో.. సరసంలో ప్రియురాలు, యుద్ధంలో సైనికుడు, పొగిడేటపుడు కవి.. కట్టు తప్పుతారట. రారా పోరా ఒరే తురే అంటారట. అలాగే ఇది కూడా.. అంటారు కొందరు.
నాకెవరూ లేక పోలేదు.. ఇదిగో ఎక్కడి నుంచో వచ్చిన డేవిడ్ వార్నర్ని నేను దొ*గ ము* కొడుకు అనదగినంత చొరవుంది. అలీని.. ల*కొడుకు అనేంత చునువుంది. ఇక రోజాను నేనే హీరోయిన్ని చేశాననేంత దగ్గరితనముంది. ఇక నాకు ఎన్టీఆర్ అవార్డు వచ్చినపుడు మీరు చప్పట్లు కొట్టకుంటే సిగ్గులేనట్టే అనేంత అతి చనువూ ఉందని చెప్పడంలో భాగమే ఇదంతా. ఇది ఒక తండ్రి దీన మానసిక గాథ. ఇందులో మీరు గుర్తించాల్సింది బంధుత్వాలను ఆప్యాయతలను. అంటే అన్నాడ్లే మా అన్నదమ్ముడు, బాబాయ్ పెదనాన్న అంటూ అక్కడితో దీన్ని ముగించాలి. ఆయన సరైన పరిస్థితుల్లో ఉండగా మనం ఏమైనా అనుకోవచ్చు. కానీ ఒక తండ్రికి మాత్రమే అర్దమయ్యే తండ్రి భాషలోంచి ఆయన్ను చూడండి. ఆ కోణంలోనే ఆయన మాటలను తీస్కోండి. అంతే తప్ప.. ఇందులో పెడర్దాలు తీయవద్దు ప్లీజ్ అన్నది ఆయన్ను బాగా ఎరిగిన వారు అంటోన్న మాట. మీరేమంటారు???






