TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దయచేసి... కనిపెట్టండి!

Published on: Thu Aug 23, 2012 4:18PM

‘మా చంటాడి మందుపట్టే ఉగ్గుగిన్నె కనిపించలేదు అక్కయ్యా’ అని ఒకరంటే.. మొన్నటి నుంచి మా ఆయన ఉంగరం కనిపించ లేదు. ఎక్కడ పెట్టారో ఏమో...అన్న సంభాషణలు అప్పుడప్పుడు చుట్టుప్రక్కల వారినుండి వినే ఉంటారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని లోకోషెడ్‌కు చెందిన రైలింజన్‌ నాలుగునెలలు గా కనిపించడం లేదని సంబంధిత అధికారులు ప్రకటించారు. ఎట్టకేలకు ఈ రైలింజన్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలోని ముంబై సమీపంలోని కళ్యాణ్‌ రైల్వేస్టేషన్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఆ కనిపించకుండా పోయింది నల్లపూసేం కాదు..., విరిగిపోయిన రైలు పట్టా అసలే కాదు.... ఏకంగా రైలింజన్‌...! అంత పటిష్టంగా భద్రతాచర్యలున్నాయి మరి...! ఈ సంఘటనపై సంబంధిత అధికారులను సస్పెండ్‌ చెయ్యడం అనేదానికంటే, కనిపించకుండా పోవడానికి మూలమైన భద్రతాలోపాలను గుర్తించి అందుకు కావలసిన జాగ్రత్త చర్యలు తీసుకుంటే బావుంటుంది. ఇలాంటి ఆలోచనలు ఏలినవారికి అస్సలు కలగవంటే కలగవుమరి...!