TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కుప్పకూలిన విమానం.. బ్రెజిల్ లో 62 మంది దుర్మరణం

Published on: Sat Aug 10, 2024 10:43AM

బ్రెజిల్‌లో శుక్రవారం (ఆగస్టు 9) జరిగిన విమాన ప్రమాదంలో   62 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రయాణికులతో వెళుతున్న విమానం సావో పువాలోలోని విన్హెడో టౌన్ సమీపంలో  కుప్ప కూలి పోయింది.  కాస్కావెల్ నుంచి గ్వారుల్హోస్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానం దట్టమైన అడవిలో అకస్మాత్తుగా కూలిపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ ఘటనలో విమానంలోని వారందరూ మరణించారని, ఓ ఇల్లు కూడా ధ్వంసమైందని అధికారులు తెలిపారు. అయితే, స్థానికులెవరికీ ప్రాణాపాయం జరగలేదని అన్నారు. ప్రమాదం విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక, అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు ప్రారం భించారు.