వైఎస్ జగన్ ధీమా అదే.. పీకే టీం సర్వే

 

ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు రావడానికి 40 రోజులు సమయముంది. ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో తెలీదు కానీ.. ప్రధాన పార్టీలు మాత్రం గెలుపు మాదంటే మాదంటూ ధీమాగా ఉన్నాయి. ఇక వైసీపీ అధినేత జగన్ అయితే ఒకడుగు ముందుకేసి.. వైసీపీ కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్, ఐప్యాక్ టీంని అభినందించారు. రెండేళ్ల నుంచి నిర్విరామంగా వైసీపీ కోసం కృషి చేసిన వారికి అభినందనలు తెలిపారు. మన ప్రభుత్వం వస్తోంది.. నా పాదయాత్ర క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లారు.. ప్రజల్లోకి వెళ్లడంతో వైసీపీ అధికారంలోకి రానుంది అని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇలానే కష్టపడి పని చేస్తే 2024 ఎన్నికల్లో కూడా మనం‌ అధికారంలోకి వస్తామని జగన్ వ్యాఖ్యానించారు.

ప్రశాంత్ కిషోర్ కూడా జగన్ రాగానే మన ముందు ఫ్యూచర్ సీఎం ఉన్నారు అంటూ జగన్‌ను తన స్టాఫ్‌కి పరిచయం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతమైన పాలన అందించడానికి జగన్ సీఎం అవుతున్నారని అన్నారు. జగన్‌కు కంగ్రాట్స్ చెప్పిన ప్రశాంత్ కిషోర్... ఏపీకి బెస్ట్ చీఫ్‌ మినిష్టర్‌గా ఉండాలంటూ ఆకాంక్షించారు.

ఫలితాలకు చాలా సమయముంది. కానీ జగన్ అప్పుడే తమ పార్టీ కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ టీంని కలిసి అభినందించారు. మన ప్రభుత్వం వస్తుంది, 2024 లో కూడా మనమే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ కూడా ఫ్యూచర్ సీఎం అంటూ జగన్ కి కంగ్రాట్స్ చెప్పారు. అసలు వీరి కాన్ఫిడెన్స్ ఏంటంటూ అందరూ షాక్ అవుతున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ టీం చేసిన సర్వేనే వారి ధీమాకు కారణమని తెలుస్తోంది. వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై ఓటింగ్ పూర్తయిన వెంటనే ప్రశాంత్ కిశోర్ టీమ్ ఓ నివేదిక రూపోందించిందట. వైసీపీకి 130 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు వస్తాయని ఆ నివేదికలో ఉన్నట్టు సమాచారం. అందుకే వైసీపీ అంత కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.