కారెక్కిన పీజేఆర్ కూతురు విజయారెడ్డి
Published on: Wed Aug 20, 2014 6:47PM

హైదరాబాద్‌కి చెందిన దివంగత రాజకీయ నాయకుడు పి.జనార్దన్ రెడ్డి కుమార్తె విజయారెడ్డి కొంత కాలం కాంగ్రెస్ పార్టీలో వుండి, ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచి ఎన్నికలలో కూడా పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా ఆమె కారెక్కారు.. తెలంగాణ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు, తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం ఆమె ఖైరతాబాద్ చౌరస్తాలోని తన తండ్రి పీజేఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం స్థానిక మహంకాళీ ఆలయం దగ్గర పూజలు చేశారు. ఆ తర్వాత ర్యాలీగా టీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్ళారు. ఈ ర్యాలీని తెలంగాణ ఎక్సయిజ్ శాఖ మంత్రి పద్మారావు జెండా ఊపి ప్రారంభించారు. ఒంటెలు, గుర్రాలు, కార్లు, ద్విచక్ర వాహనాలతో ఈ ర్యాలీని నిర్వహించారు.


