ఢిల్లీ పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా!

సౌత్ ఢిల్లీలో ఓ పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతనితో కాంటాక్ట్ అయిన వారిపై ప్ర‌భుత్వం దృష్టి పెట్టింది. లాక్ డౌన్ పిరియడ్ లో ఫుడ్ హోం డెలివరీలకు ప్రభుత్వాలు అనుమతించాయి. దాదాపు 72 మంది పిజ్జా ఆర్డర్ చేసుకున్న వారికి ఈ బాయ్ డెలివ‌రీ ఇచ్చాడ‌ట‌. అధికారులు వీరి ర‌క్త శాంప్లిస్‌ను కూడా సేక‌రిస్తున్నారు. వారందరినీ హోం క్వారెంటైన్ లో ఉంచారు.

పిజ్జా డెలివరీ బాయ్ డయాలసిస్ పేషెంట్ అట‌. అత‌ను ఓ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నాడు. అక్కడే కరోనా వైరస్ అంటుకొని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. మార్చి నెలాఖరు వరకు అతను పిజ్జా డెలివరీ చేయగా, ఇటీవల అతనిలో కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా వైరస్ హాట్ స్పాట్ కేంద్రాల్లో సౌత్ ఢిల్లీ కూడా వుంది.