పిఠాపురంలో అంతే!
Published on: Tue Oct 1, 2024 1:22PM

పిఠాపురంలో తెలుగుదేశం వర్సెస్ జనసేన అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. మిత్రపక్షాలైన ఈ రెండు పార్టీలూ ప్రత్యర్థులుగా మారి ఓ ఎన్నికలో తలపడతున్నాయి. పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన అభ్యర్థులు ప్రత్యర్థులుగా పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికల నుంచి వైసీపీ దూరంగా ఉంది. ఈ సొసైటీలో ఐదు డైరెక్టర్ పదవులకు జరుగుతున్న ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన పార్టీలు అభ్యర్థులను నిలబెట్టాయి. వచ్చే నెల 6న ఎన్నికలు జరగనున్నాయి.


