పైలిన్‌ ప్రభావం

 

ఆంద్ర ప్రదేశ్‌, ఒడిసా రాష్ట్ర మీద పైలిన్‌ ప్రభావం కొనసాగుతుంది. ఉత్తరాంద్ర జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నారు నిన్న రాత్రి తీరం దాటిన  పైలిన్‌ చాలా చోట్ల భారీ విద్వంసం స్రుష్టించింది. ఈ ప్రభావం ఆంద్ర ప్రదేశ్ లోని రెండు మూడు జిల్లాల్లోనే భారీగా ఉండగా ఒడిస్సా మాత్రం తీవ్రంగా నష్టపోయింది.

 

అయితే పైలిన్‌ ప్రతాపానికి విజయనగరం జిల్లాలో సుమారు 40 గ్రామాలు పూర్తిగా అంధకారంలో చిక్కుకున్నాయి. తుఫాను గాలుల ప్రభావానికి అరటి, నీలగిరి పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. ఒడిశాలోని ఎగువ ప్రాంతాలలో, ఉత్తరాంధ్ర జిల్లాలలోని పలు ప్రాంతాలలో కురిసిన భారీవర్షాల కారణంగా ఉత్తరాంద్ర  జిల్లాల్లోని అన్ని రిజర్వాయర్‌లు నిండిపోయాయి.. దీంతో అన్ని చోట్ల నీరు విడుదల చేశారు. ఇప్పటికే పలు రిజర్వాయర్‌లలో నీరు ప్రమాదకర స్థాయికి చేరుకుంది.

 

ఫైలిన్‌ దాటికే రైల్వే శాఖ కూడా తీవ్రంగా నష్టపోయింది. తుఫాను హెచ్చరికలతో చాలా రైళ్లను రద్దు చేయగా చాలా ప్రాంతాల్లో స్టేషన్లు, ట్రాక్‌లు, ఓవర్‌ బ్రిడ్జ్‌ లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో రైళ్లశాఖకు కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లింది. కొన్ని స్టేషన్ల వద్ద సిగ్నల్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది.