శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.21 కోట్లు
Published on: Mon Aug 21, 2023 6:52AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఈ ఉదయం (సోమవారం) శ్రీవారి దర్శనం కోసం భక్తులను నేరుగా లైన్ లో పంపుతున్నారు.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న(ఆదివారం) శ్రీవారిని 79 వేల 444 మంది దర్శించుకున్నారు. 28వేల 744 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 21 లక్షల రూపాయలుగా ఉంది.


