TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎస్ఎల్ బిసి ఘటనపై  తెలంగాణ హైకోర్టులో పిల్ 

Published on: Mon Mar 3, 2025 3:30PM

ఎస్ఎల్ బిసీ ఘటనపై  తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. టన్నెల్ లో  చిక్కుక్కున్న ఎనిమిది మంది  కార్మికులను కాపాడటంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ యూనియన్ ఈ పిల్ దాఖలు చేసింది.  ప్రమాదం జరిగి 11 రోజులు కావొస్తున్నా కార్మికులను బయటకు తీయడంలో వైఫల్యం చెందినట్లు యూనియన్ దాఖలు చేసిన పిల్ లో పేర్కొన్నారు. తెలంగాణా అడ్వకేట్ జనరల్  సుదర్శన్ రెడ్డి  విచారణ సందర్బంగా తన వాదనలు వినిపించారు.టన్నెల్ సహాయక చర్యల్లో ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీం, ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు పాల్గొంటున్నట్లు హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అడ్వకేట్ జనరల్ వాదనలకు సంతృప్తి పడ్డ బెంచ్ పిల్ పై విచారణ ముగించింది.