TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సన్‌రైజర్స్ స్టార్ క్లాసెన్‌పై పీటర్శన్ అపార నమ్మకం

Published on: Fri May 1, 2026 7:16PM

 

ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న హెన్రిచ్ క్లాసెన్ ప్రదర్శనపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ప్రశంసలు కురిపించాడు. ముంబై ఇండియన్స్‌పై క్లాసెన్ చేసిన అజేయ హాఫ్ సెంచరీ (30 బంతుల్లో 65) తర్వాత పీటర్సన్ సోషల్ మీడియా వేదికగా దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుకు ఒక విజ్ఞప్తి చేశాడు. 

2027లో స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో సఫారీలు విజేతగా నిలవాలంటే, క్లాసెన్ వంటి ఆటగాడు జట్టులో ఉండాలని సూచించాడు. ఇందుకోసం క్లాసెన్ రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకునేలా అధికారులు ఒప్పించాలని కోరాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ పరుగులు వరద పారిస్తున్నాడు. ప్రతీ మ్యాచులోనూ పరుగులు చేస్తూ.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

బుధవారం (29-4-26న)ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఈ దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ 30 బంతుల్లోనే 65 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 9 మ్యాచులు ఆడిన క్లాసెన్.. సుమారు 60 సగటుతో 414 పరుగులు స్కోరు చేశాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో ప్లేసులో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికాకు చెందిన హెన్రిచ్ క్లాసెన్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అప్పటి నుంచి కేవలం ఫ్రాంఛైజీ క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు.