TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఫొటోల పిచ్చితో వందే భారత్ రైల్లో రాజమండ్రి టు విజయవాడ ఫ్రీ ట్రావెల్

Published on: Tue Jan 17, 2023 11:00AM

ఫొటోల పిచ్చి ఓ వ్యక్తికి చుక్కలు చూపించింది. వందేభారత్ రైలులో తలుపులు మన ఇష్టం వచ్చినప్పుడు తీయడానికి, మూయడానికి అవకాశం ఉండని సంగతి తెలిసిందే కదా? అయితే ఆ విషయాన్ని మరచిపోయిన ఓ వ్యక్తి రాజమండ్రిలో వందే భారత్ రైలు ఎక్కి ఫొటోలు తీసుకుందామనుకున్నాడు. జనం అది ఆగే స్టేషన్లకు తండోపతండాలుగా వస్తున్నారు. అలాగే రాజమండ్రీలో రైలు చూసేందుకు వచ్చిన వ్యక్తి ఆగి ఉన్న రైలే కదా అని లోపలికి ఎక్కి ఫొటోలు తీసుకుందామనుకున్నాడు. అనుకున్నదే తడవు రైలెక్కేశాడు. ఫొటోల హడావుడిలో ఉండగానే రైలు డోర్లు మూసుకున్నాయి.

ఆ డోర్ల ఆపరేటింగ్ అంతా  రైలు డ్రైవర్ చేతిలో ఉంటుంది. రైలు ప్లాట్ ఫాం మీద ఆగినప్పుడు వాటిని తెరవడం, రైలు బయలుదేరే ముందు వాటిని మూసి వేయడం అంతా డ్రైవర్ చేతిలో ఉంటుంది. అంటే అందుకు సంబంధించి బటన్ లోకో పైలట్ వద్ద ఉంటుంది.

ఆ విషయం తెలియని మనోడు పాపం రైలు కదులుతుండగా దిగేద్దామనుకున్నాడు. తీరా రైలు బయలుదేరడం గమనించి బయటకు వచ్చేద్దామనుకునే సరికి రైలు డోర్లు మూసుకుపోయాయి. అవి మళ్లీ తెరుకుకునేది విజయవాడ స్టేషన్ లోనే. దీంతో ఆ ఫోటోల పిచ్చి యువకుడు విజయవాడ వరకూ రైలులోనే ఉండిపోవలసి వచ్చింది. కాబట్టి ఫొటోల పిచ్చి ఉన్న వారు వందేభారత్ రైలెక్కి   ఫొటోలు తీసుకునే విషయంలో కొంచం ముందు వెనుకలు ఆలోచించాలి మరి