ఫూలన్‌దేవి హంతకుడికి జీవిత ఖైదు
Published on: Thu Aug 14, 2014 6:01PM

మాజీ బందిపోటు, పార్లమెంటు సభ్యురాలు ఫూలన్‌దేవి హంతకుడు షేర్ సింగ్ రాణాకు ఢిల్లీ కోర్టు జీవితఖైదు విధించింది. ఖైదుతోపాటు లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది. గత పదమూడేళ్లుగా సాగుతున్న ఈ కేసుపై ఢిల్లీలోని అదనపు సెషన్స్ కోర్టు గురువారం తుది తీర్పు ఇచ్చింది. ఈ నెల 8న కోర్టు షేర్ సింగ్ రాణాను దోషిగా నిర్ధారించింది. ఆగస్టు 12న శిక్ష ఖరారవుతుందని భావించినా రెండు రోజులు ఆలస్యంగా తుది తీర్పు వెలువడింది. బందిపోటు రాణిగా ప్రఖ్యాతి గాంచిన పూలన్‌దేవి 2001 జూలై 25న ఢిల్లీలోని తన నివాసం ముందు హత్యకు గురైన సంగతి తెలిసిందే. పార్లమెంటు సమావేశాలకు హాజరై మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి వచ్చిన ఆమెను రాణా సహా ముగ్గురు దుండగులు అతి దగ్గర నుంచి కాల్చి చంపారు. ఈ కేసులో 10 మంది నిందితులను సరైన సాక్ష్యాధారాలు లేవంటూ నిర్దోషులుగా కోర్టు విడుదల చేసింది


