TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నేను నా భార్య మాట్లాడుకునేది విన్నారు.. ఈటల సంచలన వాఖ్యలు

Published on: Tue Jun 24, 2025 3:03PM

 

ఫోన్ ట్యాపింగ్ కేసులో మల్కాజిగిరి బీజేపీ ఎంపీ  ఈటల రాజేందర్ సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. విచారణ అనంతరం ఈటల మీడియాతో మాట్లాడుతు ఫోన్ ట్యాపింగ్ విచారణ ఇంకా ఎంతకాలం చేస్తారని ఎంపీ   ప్రశ్నించారు. హుజురాబాద్ బై ఎలక్షన్ సమయంలో తన ఫోన్ అనేక సార్లు ట్యాప్ చేశారని అన్నారు. నేను, నా భార్య మాట్లాడుకునే సంభాషణలు కూడా విన్నారని నాయకుల ఫోన్లను మాత్రమే కాకుండా వారి గన్ మెన్‌ల ఫోన్‌లను కూడా ట్యాప్ చేశారన్నారు. 2018లో తాను ప్రభుత్వంలో ఉన్నప్పుడే తనను ఓడించే ప్రయత్నం జరిగిందన్నారు. గత బీఆర్‌ఎస్ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ తనకు అనుకులంగా పనిచేసే వారిని ఉన్నత స్థాయిలో నియమించుకున్నారని తెలిపారు. 


ట్యాపింగ్ కేసులో ఎవరు ఉన్న ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఈటల  డిమాండ్ చేశారు. 2023లో గజ్వెల్‌లో, హుజురాబాద్‌లో పోటీ చేసినప్పుడు తమ ఫోన్లు ట్యాప్ చేశారన్నారు. ఎస్ఐబీ చీఫ్‌గా ప్రభాకర్ రావు నియామకం అక్రమం అని చెప్పారు. గత బీఆర్‌ఎస్ హయాంలో  జరిగిన అక్రమాలపై కమిటీలు వేస్తున్న ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఈటల రాజేందర్  ప్రశ్నించారు. ఎందుకు నివేధికలను బయటపెట్టడంలేదని అడిగారు.  రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ హక్కును ఆటంకం కలిగించే హక్కు ఎవరికీ లేదని అన్నారు.  సంఘవిద్రోహ శక్తులు కాకుండా నాయకులు ఫోన్లు ట్యాపింగ్ చేయడం దారుణమని చెప్పారు. ఎన్నికల్లో గెలిచే దమ్ములేకే ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంలో విచారణ కమిటీ వేశారు కానీ దర్యాప్తు వేగంగా జరగడం లేదని ఎంపీ ఈటల పేర్కొన్నారు.