గండం గడిచింది

 

తీరం దాటిన పైలిన్‌ తుఫాన్‌ తగ్గుముఖం పట్టడంతో ఆదివారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధికారులతో సమీక్షసమావేశం నిర్వహించారు. తుఫాన్‌ తీవ్రత కాస్త తగ్గటంతో అధికారుల నష్ట నివారణ చర్యలపై ద్రుష్టి సారించాలని కిరణ్‌ ఆదేశించారు. అయితే ఈ ప్రభావం మన రాష్ట్రంతో పొల్చుకుంటే ఒరిస్సా మదే తీవ్రంగా ఉంది.

 

 

తుఫాన్‌ ప్రభావం భారీగా ఉంటుందని అందరూ భావించిన ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటంలో ప్రాణనష్టాన్ని ఘననియంగా తగ్గించగలిగారు. అయితే తుఫాను వల్ల దాదాపు రూ.1400 కోట్లు ఆస్తి నష్టం జరిగినట్లుగా ఒడిశా ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. తుఫాను తీవ్రతకు ఎడుగురు మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

 

మన రాష్ట్రంలో ఫైలిన్ ప్రభావం శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా పడింది. నాలుగు మండలాల్లో భారీగా పంట నష్టం ఏర్పడింది. తుఫాను వల్ల 7,500 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లింది. కూరగాయలు, అరటిలకు వెయ్యి హెక్టార్లలో నష్టం వాటిల్లింది. నలభై వేలకు పైగా మత్సకారుల కుటుంబాలు ఉపాధి కోల్పోయినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.