TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

తగ్గని జాత్యహంకారం..తెలుగు మహిళపై దాడి..

Published on: Tue Mar 14, 2017 10:47AM

 

ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన దగ్గర నుండి అమెరికాలో జాత్యహంకారం బాగా పెరిగిపోయింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. భారతీయులపై జాత్యహంకార దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఈ దాడులు మరింత పెరిగాయి. ఇటీవలే తెలుగువాడైన కూచిభొట్ల శ్రీనివాస్ ను కాల్చి చంపగా.. మరో భారతీయుడి స్టోర్ ను తగులబెట్టేశారు. ఇప్పుడు తాజాగా మరో మహిళపై దాడికి పాల్పడ్డారు. వివరాల ప్రకారం..  ఫిలడెల్ఫియాలోని తెలుగు మహిళపై ఓ దుండగుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు దేశం విడిచి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశాడు. దీంతో ఇప్పటికే వరుసగా జరుగుతున్న దాడుల నేపథ్యంలో తెలుగువారు భయాందోళనలో ఉండగా.. ఇప్పుడు తాజా ఘటనతో మరింత ఆందోళన చెందుతున్నారు.