తీరం దాటనున్న 'ఫైలిన్'

 

Phailan fear looms, Phailan cyclone, Phailan update

 

 

'ఫైలిన్' తుఫాన్ వేగం పెరిగింది. పారదీప్‌కు 375 కి.మీ దూరంలో , కళింగపట్నానికి 270 కి.మీ దూరంలో, గోపాలపూర్‌కు 345 కి.మీ దూరంలో తుఫాను కేంద్రీకృతమైంది. గోపాలపూర్ వద్ద ఈరోజు తుఫాను తీరం దాటే అవకాశం ఉంది.

 

తుఫాన్ కారణంగా అన్ని ఓడరేవుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. జాలర్లు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 'ఫైలిన్' తుఫాన్ ప్రభావంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. సుమారు 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావొచ్చని అంచనా.



48 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 6 గంటల్లో తీర ప్రాంతంలో 45-65 కి.మీ వేగంతో గాలలు వీచనున్నాయి. గాలులు క్రమక్రమంగా పెరిగే అవకాశం ఉంది. మధ్యాహ్నానికల్లా గాలుల తీవ్రత 100-150 కి.మీ పెరిగే అవకాశం ఉండగా... సాయంత్రానికి 210-220 కి.మీ మధ్య గాలుల వేగం పెరుగనుంది.