TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పెట్రోల్‌ ధరలను తగ్గించరట

Published on: Sat Jun 2, 2018 11:43AM

 

పెట్రోలు ధరలు తగ్గుతాయేమో అని ఆశించేవారందనీ భంగపరిచే వార్త ఇది. ప్రభుత్వ ఇంధన సంస్థ ONGC తాము పెట్రోలు ధరలను తగ్గించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేసింది. ఆ సంస్థ చైర్మన్‌ శశి శంకర్‌కీ, పెట్రోలియం శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కీ మధ్య జరిగిన చర్చలో ఈ విషయం తేలింది. ఇప్పటికే తాము హిందుస్థాన్ పెట్రోల్‌ కార్గొరేషన్‌, గుజరాత్‌ పెట్రోల్‌ కార్పొరేషన్ లాంటి సంస్థలను కొనుగోలు చేసి నిండా కష్టాల్లో ఉన్నామనీ... తమ వైపు నుంచి పెట్రోలు ధరలను తగ్గించే ప్రసక్తే లేదని చైర్మన్ చెప్పేశారు. కావాలంటే మీరే పన్నులు తగ్గించుకోండి అంటూ ఓ ఉచిత సలహా కూడా పడేశారు! మరి పెట్రోలియం మంత్రివర్యులు ఆ సలహాని పాటిస్తారో లేదో చూడాలి!