TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

త్వరలో మళ్ళీ పెట్రో మంటలు

Published on: Mon Aug 13, 2012 11:33PM

ప్రభుత్వరంగ చమురు సంస్ధలు మొదటి త్రైమాసికంలో కనీవినీ ఎరుగని రీతిలో నష్టాలు ప్రకటించాయి. ప్రభుత్వం నుండి రావల్సిన బకాయిలు రాకపోవడంతో కంపెనీ నష్టాలు మరింత పెరిగాయని తెలిస్తోంది. ఉత్పత్తి వ్యయాలంటే తక్కువ ధరకు ఉత్పత్తులు విక్రయించి నష్టపోయినట్లు మూడు ప్రభుత్వ రంగానికి చెందిన చమురు సంస్ధలు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియం, హిందుస్తాన్‌ పెట్రోలియంలు చెబుతున్నాయి. ప్రతిలీటరు పెట్రోల్‌పై 3.56 రూపాయలు నష్టపోతున్నామని తెలిపారు. దీంతో పెట్రోలియం పై మూడు రూపాయలు పెంచాల్సిందిగా వారు కోరుతున్నారు. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ దేశంలో అతి పెద్ద రిటైల్‌ సంస్థ. మొదట త్రైమాసికంలో భారత దేశ చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో 22,451 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. ప్రభుత్వం నుండి బకాయిలు రాకపోవడంతో పెద్ద మొత్తంలో బకాయిలు పెరిగిపోయాయని ఐఒసి తెలిపింది. మార్కెట్‌ ధరలకంటే తక్కువదరకు కిరోసిన్‌,వంటగ్యాస్‌, డీజిల్‌ విక్రయించడం వల్లే ఇంత భారీ నష్టాలు వచ్చాయని వారు తెలిపారు. వాస్తవానికి తమ క్రెడిట్‌ బిల్‌1,10,00,000 కోట్లరూపాయలని ఇప్పటికే 90,000 కోట్ల పైన క్రెడిట్‌ బిల్లు వాడుకున్నామని చమురు సంస్దలు తెలియచేశాయి. ఇకపై ప్రభుత్వం నుండి బకాయిలు అందకపోతే తాము అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు కొనలేమని ఐఓసి చైర్మన్‌ అన్నారు. దేశంలోని అతిపెద్ద సంస్థల్లో మూడోదైన హిందూపెట్రోలియం ఏప్రిల్‌ - జూన్‌ కి నికర నష్టం 9,249 కోట్లు ప్రకటించింది.