TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పెట్రోల్ సంస్థలకు నిజంగా నష్టాలు వస్తున్నాయా?

Published on: Fri May 25, 2012 11:15AM

పెట్రోలియం సంస్థలకు వేల కోట్ల నష్టాలు వస్తున్నాయని, అందుకే ధరలు పెంచడం అనివార్యమైందని పెట్రోల్ ధరలు పెంచే ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం చెప్పేమాట ఇది. ప్రతి వ్యాపార సంస్థకు రెండు రకాల అకౌంట్లు వుంటాయి. ఒక అకౌంటు వాస్తవాలు ప్రతిభింభించేదికాగా, రెండొది పత్రికలకోసం, ప్రజలను మభ్యపెట్టడం కోసం చేసే ప్రకటనలకు సంబంధించినది. ఈ రెండో అకౌంట్ ను చూపించి చమురు కంపెనీలు నష్టాలు అనే పదాన్ని జపిస్తుంటాయి. నిజానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం వంటి సంస్థలన్నీ లాభాల బాటలో పయాణం చేస్తున్నాయి. వాటికి సంభందించిన షేర్ల ధరలను గమనిస్తే ఈ విషయం అర్థం అవుతుంది. ఈ కంపెనీలలో పనిచేసే ఉద్యోగులకు భారీగా జీతాలు, బోనస్ లు చెల్లించడంతో పాటు అనేక రాయితీలు ఇస్తుంటారు.



అంతేకాకుండా బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటు సభ్యులకు భారీగా నజరానాలు అందించే విధంగా ఈ చమురు కంపెనీలు వివిధ కారణాలు చూపుతూ పెట్రోలియం ధరలు పెంచిన ప్రతిసారి కృతజ్ఞతగా ప్రధాన మంత్రికి, పెట్రోలియం మంత్రికి, ఇతర ముఖ్యమైన నేతలకు, ఆర్థికశాఖ సీనియర్ అధికారులకు బహుమతుల రూపంలో వేల కోట్ల రూపాయలు ముడుపులు అందుతుంటాయి. అందుకే పెట్రోల్ ధరలు ఎన్నిసార్లు పెరిగితే అన్నిసార్లు వీరికి నజరానాలు అందుతాయి ! ఇక మనం చెల్లించే పెట్రోల్ ధరలో కూడా 33 శాతం రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నులు, మరో 16 శాతం కేంద్రప్రభుత్వం విధించే ఎక్సైజ్ పన్నులు, విద్యా, ఆరోగ్య సెస్ వంటి పన్నులు వుంటాయి. అంటే లీటరు పెట్రోల్ కు మనం చెల్లించే 82 రూపాయలలో 40 రూపాయలు పన్నుల రూపంలో ప్రభుత్వాలు సామాన్యులను దోచుకుంటున్నాయి.