ఇప్పుడు డీలర్ల వంతన్నమాట!
Published on: Fri Sep 28, 2012 7:32AM
.png)
నిన్నటి వరకూ ధరల వడ్డింపుతో సతమతమైన సగటుమనిషి బాధలు ఇప్పుడప్పుడే తీరేటట్లు లోవు. ఇప్పుడు పెట్రోలు డీలర్ల వంతొచ్చింది! అదెలాగంటో` నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో తాము ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డామనీ, ఈ ఇబ్బందులు తగ్గించుకోవడంలో భాగంగా అక్టోబర్ 15నుండి బంక్‌లను అన్ని వేళలా (24 గంటలు) తెరచివుంచలేమనీ పెట్రోల్ బంక్ డీలర్లు ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నారు. ఎక్కువ కమీషన్ కావాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇక నుండి 24 గంటలు నడుస్తున్న పెట్రోలు బంక్‌లు కొన్ని గంటలకే పరిమితం కానున్నాయన్నమాట! అయితే ఇది మరో 15 రోజుల్లో ఆయిల్ సంస్థలు తీసుకునే నిర్ణయం ఆధారపడి ఉంటుందని అనుకోవచ్చు. ప్రభుత్వాలు ధరలు పెంచిన ప్రతిసారీ వ్యాపారవర్గృాలు రేట్లుపెంచడంతోబాటు మరిన్ని వెసలుబాట్లు కావాలంటూ డిమాండ్ చేయడం, సమ్మెలు చేయడం నిరంతరంగా జరిగిపోతోంది. అయితే` వీటన్నింటి మూలాన ప్రత్యక్షంగా, పరోక్షంగా నష్టపోయేది మాత్రం ప్రజలే! ఈ ధరల పెంపుదలవల్ల ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాలు దినదినగండంగా రోజుగడపవలసిరావడం శోచనీయం! ప్రభుత్వానికైనా... కంపెనీలకైనా... ఇలా ఎవరికి కోపం వచ్చినా... నష్టపోయేది సామాన్యులే అన్నది మాత్రం వాస్తవం. ఇప్పటికైనా ధరలపెంపు విషయంలో సామాన్యుని స్థితిగతులను దృష్టిలో పెట్టుకోకుంటే ప్రజాందోళన ఉధృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.


