నాలుగు రోజుల్లో పెట్రోల్ ధరలు తగ్గిస్తాం..

 

ఇప్పటికే పెట్రోల్ ధరలు రోజు రోజుకి పెరుగుతుండటంతో ప్రజలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇక కర్ణాటక ఎన్నికల తర్వాత ఈ ధరలు ఇంకా పెరగడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో బీజేపీ చీఫ్ అమిత్ షా స్పందించి  మరో నాలుగు రోజుల్లో ఈ సమస్య నుంచి ప్రధాని మోదీ గట్టెక్కిస్తారని అన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, త్వరలోనే ధరలను నేలకు దించేందుకు మోదీ చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. ధరల తగ్గింపు కోసం ఉన్నతస్థాయిలో కసరత్తు జరుగుతోందని, మరో మూడునాలుగు రోజుల్లో ఆ శుభవార్త వింటారని అమిత్ షా చెప్పారు. ఓ చక్కని పరిష్కారంతో మోదీ ప్రజల ముందుకు వస్తారని తెలిపారు.