దీపావళి గిఫ్ట్ : లీటర్ పెట్రోల్ పై 5, డీజిల్ పై 10 రూపాయలు తగ్గింపు
Published on: Wed Nov 3, 2021 8:14PM
దేశ ప్రజలకు దీపావళి గిఫ్ట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపుతో కుదేలవుతున్న వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంధన ధరలపై ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. లీటర్ పెట్రోల్ పై ఐదు రూపాయలు, లీటర్ డీజిల్ పై 10 రూపాయలు తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తగ్గించిన ధరలు దీపావళి రోజు నుంచే అమలు కానున్నాయి. వాహనదారులకు మరింత ఉపశమనం కల్పించేందుకు రాష్ట్రాలు కూడా తమ పన్నులను కాస్త తగ్గించుకోవాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్రం.


