రాహుల్ గాంధీకి సుప్రీంలో ఊరట
Published on: Thu May 9, 2019 2:35PM

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాహుల్‌కు బ్రిటన్ పౌరసత్వం ఉందని.. ఆయనను లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. పిటిషనర్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది.
బ్రిటన్ కు చెందిన బ్యాకప్స్ లిమిటెడ్ అనే కంపెనీ తమ వార్షిక డేటాలో రాహుల్ గాంధీని బ్రిటీష్ పౌరుడిగా పేర్కొందని, బ్రిటిష్ పౌరసత్వం ఉన్న రాహుల్‌ను ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఢిల్లీకి చెందిన జై భగవాన్ గోయల్, చందర్ ప్రకాశ్ త్యాగి అనే ఇద్దరు వ్యక్తులు వారం రోజుల క్రితం దాఖలు ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. ఓ కంపెనీకి సంబంధించిన పేపర్ ఆధారంగా కోర్టును ఎలా ఆశ్రయిస్తారని సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ పిటిషనర్ ను ప్రశ్నించారు. ఓ కంపెనీ పేపర్ ను ఆధారంగా చేసుకుని కోర్టును ఆశ్రయించడం సరికాదని చెబుతూ పిటిషన్ ను కొట్టివేశారు.


