TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

చంద్రబాబుపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు!!

Published on: Fri Jun 14, 2019 4:48PM

 

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో ఈరోజు పిటిషన్ దాఖలు అయింది.  ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ఆయనపై రిపబ్లిక్‌ పార్టీ అధికార ప్రతినిధి బోరుగడ్డ అనిల్‌కుమార్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రభుత్వ పథకాల పేరుతో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు ప్రభుత్వ సొమ్మును వాడుకున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ అన్నదాత సుఖీభవ, పసుపు-కుంకుమ పథకాల పేరుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని తెలిపారు. చంద్రబాబు సొంత ఖర్చు కింద ఆ నిధులను జమ చేయాలంటూ అనిల్‌ కుమార్‌ కోరారు. ఈ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు సోమవారం విచారణ జరపనుంది.