TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాటేసిన పామును కొరికి చంపేశాడు!

Published on: Fri Sep 19, 2025 10:09AM

ఎవరైనా పాము కాటేస్తే.. ప్రాణభయంతో వణికి పోతారు. వెంటనే వైద్య సాయం కోసం పరుగులు తీస్తారు. కానీ ఈ వ్యక్తి మాత్రం నన్నే కరుస్తావా అంటూ పాముపై పగబట్టి దానినే కొరికి చంపేశారు. ఆ తరువాత విషం తలకెక్కి ప్రాణాపాయ స్థితిలో రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయమేంటంటే.. తొట్టంబేడు మండలం చియ్యవరంకు చెందిన వెంకటేష్ బుధవారం (సెప్టెంబర్ 17) రాత్రి పూటుగా మద్యం తాగి ఇంటికి వెడుతుండగా అతడిని ఓ  తాచుపాము కాటేసింది.

మద్యం మత్తులో ఉన్న వెంకటేష్ కు తనను కాటేసిన పాముపై పట్టరాని కోపం వచ్చింది. వెంటనే ఆ పామును పట్టుకుని దాని తల కొరికి చంపేశాడు. అక్కడితో ఆగకుండా ఆ చచ్చిన పామును తనతో పాటు ఇంటికి తీసుకెళ్లి పక్కన పెట్టుకుని పడుకున్నాడు. గురువారం (సెప్టెంబర్ 18) ఉదయం ఇంట్లో వారు గమనించారు. విషం తలకెక్కి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వెంకటేష్ ను శ్రీకాళహస్తిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారు అతడిని తిరుపతి రుయాఆస్పత్రికి రిఫర్ చేయడంతో కుటుంబ సభ్యులు అతడిని రుయాకు తరలించారు. ప్రస్తుతం వెంకటేష్ ప్రాణాపాయ స్థితిలో రుయా ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్నాడు.