TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ ను జనమే తరిమేస్తారు!

Published on: Thu May 19, 2022 3:44PM

ఏపీలో మూడేళ్లుగా అభివృద్ధి లేదు. ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. పరిపాలన పడకేసింది. సమస్యలతో జనం అల్లాడిపోతున్నారు. ఒక్క కొతత్ పరిశ్రమనైనా ఏపీకి తేలేదు. కొత్త ఉద్యోగాల కల్పనే లేదు. ఉన్న ఉద్యోగాలూ ఊడిపోతున్న పంఘటనలు. గ్రామ, వార్డు సచివాలయాల పేరుతో నిరుద్యోగుల చేత తక్కువ వేతనాలతో వెట్టిచాకిరీ చేయిస్తుండడంతో తీవ్ర అసంతృప్తి ఉంది. ప్రొబేషన్ ప్రకటించకుండా అన్యాయం చేస్తున్న జగన్ సర్కార్ పై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఛాన్స్ వస్తే.. గుణపాఠం చెప్పేందుకు వారు సిద్ధంగా ఉన్నారన్నది గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలూ ఎదుర్కొంటున్న ప్రజా నిరసనలే తార్కణం.

ఏపీలో రహదారులు నరకానికి దగ్గర దారిగా మారాయి. వైద్య సేవలు, వసతులు అంతంత మాత్రమే. విద్యుత్ సరఫరా చేయలేక పరిశ్రమలకు ప్రభుత్వమే సెలవులు ప్రకటించిన దుస్థితి. దీంతో వేలాది కార్మికులకు ఆర్థిక ఇబ్బందులు. వ్యవసాయానికి 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వకుండా జగన్ మడమ తిప్పేశారు. ఆర్టీసీ, విద్యుత్ చార్జీల పెంపు, వ్యవసాయ మోటార్లకు మీటర్ల వ్యవహారంతో జనం విసిగిపోయారు.

ఉచితంగా ఇళ్లస్థలాలు ఇస్తామన్న వైసీపీ సర్కార్ మాట నెరవేర్చకపోవడంతో లక్షలాది మంది మహిళలు ఆగ్రహంతో ఉన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలతో వైసీపీ సర్కార్ పెట్టుకుంటున్న పేచీలతో ఆ వర్గాలన్నీ జగన్ కు బుద్ధి చెప్పేందుకు రెడీగా ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. నిబంధనల పేరుతో సంక్షేమ పథకాల లబ్ధిదారుల సంఖ్యలో కోతపై జనాగ్రహం చంద్రబాబు జిల్లాల పర్యటనల్లో ప్రజలు ప్రస్ఫుటంగా వ్యక్తం చేయడమే కాకుండా బాబే ముఖ్యమంత్రి కావాలన్న తమ ఆకాంక్షను చాటారు.

అందుకే రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో బాబు పర్యటనలకు విశేష జనస్పందన కనిపించింది. ఆ జనస్పందనే జగన్ భవిష్యత్ ఎలా ఉండబోతోందో ఎత్తి చూపింది.