TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మరో రెండు దశాబ్దాలు ప్రజలకు కాంగ్రెస్ కు ఓటు వేయరు

Published on: Sat May 2, 2026 6:06PM

 రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి పెరిగిపోయిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. నందినగర్ లోని తన నివాసంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా  పార్టీ నేతలతో సమావేశమైన కేటీఆర్.. ఈ రెండున్నరేళ్ల పాలనలో కాంగ్రెస్ చేసిన అవినీతి, కుంభకోణాలను చూసిన ప్రజలు ఆ పార్టీకి మరో రెండు దశాబ్దాల పాటు ఓటు వేయరన్నారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో   బీఆర్ఎస్ బ‌లోపేతం,  స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం, క‌మిటీల నిర్మాణం లాంటి అంశాల‌పై నేతలతో చర్చించిన కేటీఆర్ .  స్థానిక సంస్థల ఎన్నికల్లో  మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను  ఈ సందర్భంగా అభినందించారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికలకు సమాయత్తం కావాలని సూచించారు.

అలాగే కేంద్ర ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పించారు. కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందన్న కేటీఆర్.. కమర్షియల్ గ్యాస్ సిలెండర్ పై ఒకే సారి దాదాపు వెయ్యి రూపాలయలు పెంచడం అందులో ఒకటన్నారు. గ్యాస్ ధర పెంపునకు వ్యతిరేకంగా ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.