TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రజా తీర్పుకు అద్దంపట్టిన ఎగ్జిట్ పోల్స్.. రేవంత్

Published on: Thu Nov 30, 2023 5:56PM

ప్రజా తీర్పునకు ఎగ్జిట్ పోల్స్ అద్దం పట్టాయని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో వచ్చే నెల 3న ప్రజాపాలన ఆరంభమౌతుందని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ మలి దశ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతా చారి మరణించిన డిసెంబర్ 3నే రాష్ట్ర ఎన్నికల ఫలితాలు రావడం యాధృచ్ఛికమని రేవంత్ అన్నారు.

కాంగ్రెస్ నిస్సందేహంగా విజయం సాధించి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టబోతున్నదనీ, ప్రజా చైతన్యం, కాంగ్రెస్ కార్యకర్తల పోరాటం ద్వారానే ఈ విజయం సాధ్యమైందని అన్నారు. పార్టీ విజయం కోసం అహర్నిశలూ కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యర్తలకు కృతజ్ణతలు తెలిపిన రేవంత్ రెడ్డి.. ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.