TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చెత్త పన్నుతో చిక్కులు.. జ‌గ‌న‌న్న‌పై జ‌నం తిరుగుబాటు..

Published on: Sat Mar 19, 2022 1:08PM

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేతిలో చిల్లి గవ్వలేదు, కావచ్చు.ఖజానా వట్టి పోయి ఉండవచ్చును. అయినా, చెత్త పను కట్టలేదని షాపుల ముందు చెత్త తెచ్చిపోయడం, ఇంటి పన్ను కట్టలేదని ఇళ్ళల్లోకి జొరబడి సామానులు ఎత్తుకు పోవడం, సర్కార్ చేయవలసిం పనులేనా? కాదు,ముమ్మాటికీ,కాదు.పన్నులు కట్టకపోతే, కట్టించుకునేందుకు ఒక పద్దతి ఉంటుంది. అంతేకానీ, నడి వీధిలో చెత్తపోసి, ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం, అవమానించడం, ఇంటి పన్ను చెల్లించలేదని ఇళ్ళలోకి వెళ్లి సామానులు తీసుకు వెళ్ళడం, వడ్డీ వ్యాపారులు చేసినా డి నేరం వుతుంది. అలాంటిది ప్రభుత్వం, అదే పనిచేస్తే నేరం రెండితలు అవుతుంది. అయినా, ఏపీ ప్రభుత్వం అదే చేస్తోంది. కాకినాడ, కర్నూలు సహా అనేక నగరాలు పట్టణాలలో పన్ను కట్టకపోతే సామాన్లు పట్టుకుపోతామని మున్సిపల్ సిబ్బంది ట్రాక్టర్లలో తిరుగుతూ ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఒక విధంగా, జగన్ సర్కార్ పన్ను వసూలుకు అనుసరిస్తున్న పద్దతి, కాల్ మనీ కథలను గుర్తుకు తెస్తోందని సామాన్యులు అంటున్నారు. ప్రభుత్వానికి,వడ్డీ వ్యాపారులకు తేడా లేకుండా పోయిందని, ఇది మనవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని అంటున్నారు. 

అయితే ఇది స్థానికంగా అధికారులు తీసుకున నిర్ణయం కాదు. రాష్ట్ర స్థాయిలో తీసుకున్న నిర్ణయం. ముఖ్యమంత్రి అదేశాల మేరకు తీసుకున్న నిర్ణయమని అధికారాలు చెపుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) ఈ నెలాఖరుతో ముగుస్తున్న నేపధ్యంలో, ఈ లోగా, అంటే, మార్చి 31 లోగా ప్రజల నుంచి, చెత్త పన్ను, ఆస్తి పన్నుల పద్దులకింద  రూ.1,033.94 కోట్లు వసూలుచేసి ఖజనాకు జమచేయాలని ప్రభుత్వం ఆదేశాలు జరీ చేసింది. ఆ ఆదేశాలు మెడ మీద కత్తిలా వెల్లడుతున్నాయి. అందుకే అధికారులు అన్ని ఉపాయాలూ ప్రదర్శిస్తున్నారు. సచివాలయాల ఉద్యోగులు, వార్డు వాలంటీర్ల సేవలనూ వినియోగిస్తున్నారు.

అయిత జగన్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా తెచ్చిన చెత్త పన్నువిషయంలో, అదే విధంగా పెంచిన ఆస్తి పన్నుపై ప్రజల్లో, ప్రజాసంఘాల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇప్పటివరకూ ఆచితూచి వ్యవహరించిన పుర, నగరపాలక సంస్థలు కొద్దిరోజులుగా వీటి వసూళ్ల కోసం ప్రజలపై ఒత్తిడి పెంచుతున్నాయి. చెత్త పన్ను చెల్లించని దుకాణాల ముందు చెత్త వేసి, ఆస్తిపన్నుపై స్పందించని ప్రజల ఆస్తులు జప్తు చేస్తామని బెదిరిస్తున్నారు. కాగా, జగన్ ప్రభుత్వం పన్ను వసులకు అనుసరిస్తున్నపద్దతులను ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. చెత్త పన్న వేయడమే చెత్త ఆలోచన, ఆపైన పన్ను వసూలుకు అనుసరిస్తున్న పద్దతులు మరింత అవమానకరంగా ఉన్నాయని,ప్రజలు ఎదురు తిరుగుతున్నారు. 

కాగా, తాజాగా నగరపాలక సంస్థల పరిధిలో పన్నుల వసూలుకు సంబంధించిన ఘటనలపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్’ స్పందించారు. పన్ను కట్టకపోతే సామాన్లు పట్టుకుపోతామని మున్సిపల్ సిబ్బంది ట్రాక్టర్లలో తిరగడం ఏం సూచిస్తోందని ట్విట్టర్‌ ద్వారా ప్రశ్నించారు. డెయిలీ ఫైనాన్స్ వ్యాపారం చేసుకునే వాళ్ల మాదిరిగా ప్రభుత్వ ఆలోచన విధానం ఉందని పవన్ మండిపడ్డారు. చెత్త సేకరణకు పన్ను విధించడమే దరిద్రం అనుకుంటే...దాన్ని వసూలు చేస్తున్న విధానం మరింత దరిద్రంగా ఉందన్నారు.కర్నూలులో వ్యాపారులు చెత్తపన్ను చెల్లించలేదని చెత్తను పోసి అవమానిస్తారా అని ప్రశ్నించారు పవన్‌. ఇది కచ్చితంగా మానవహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. ప్రజలు గౌరవప్రదంగా జీవించడం ప్రభుత్వానికి నచ్చడం లేదన్నారు.

ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మొదలు ప్రతి ఒక్కరు చెత్త పన్ను, జుట్టు (జిజియా) పన్నును గుర్తుతెస్తోందని అంటున్నారు. అలాగే, అధికారుల మెడల మీద కత్తిపెట్టి ప్రభుత్వం ప్రస్తుతానికి, ఖజానా నింపుకోవచ్చని, అయితే,అందుకు భార్ర మూల్యం చెల్లించక తప్పదని, హెచ్చరిస్తునారు.