TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లోక్‌సభలో ఓకే నేడు రాజ్యసభకు !

Published on: Wed Dec 28, 2011 9:14AM

న్యూఢిల్లీ: దేశ ప్రజలు ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న లోక్పాల్ బిల్లుకు ప్రతిపక్ష పార్టీల నిరసనల మధ్య లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లు బుధవారం రాజ్యసభ ముందుకు రానుంది. మరోవైపు బలమైన, పటిష్టమైన లోక్పాల్ బిల్లు కోసం ప్రముఖ సామాజికవేత్త అన్నా హజారే ముంబైలో చేపట్టిన మూడు రోజుల దీక్ష బుధవారానికి రెండు  రోజులకు చేరుకుంది.

అయితే, లోక్‌సభ ఆమోదించిన లోక్పాల్ బిల్లుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి లోపాలతో ఉన్న బిల్లును ఉపసంహరించుకుని మరో కొత్త బిల్లును ప్రవేశపెట్టాలని ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుండగా, మిగిలిన పక్షాలు కూడా కీలక మార్పులు చేర్పులు చేయాలని కోరుతున్నాయి.

అయితే ఈ బిల్లుపై జరిగిన చర్చకు ప్రధాని సమాధానమిస్తూ దేశ రాజ్యాంగ స్వరూపానికి విరుద్ధంగా ఎలాంటి చర్యలు చేపట్టబోమని ఆయన స్పష్టం చేశారు.లోక్పాల్ పరిధిలోకి సీబీఐని తీసుకురావాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను తోసిపుచ్చుతున్నట్టు చెప్పారు.
ఈ పరిస్థితుల్లో లోక్పాల్ బిల్లు బుధవారం రాజ్యసభ ముందుకు రానుంది.  సభలో అధికార యూపీఏకు సుమారుగా 120 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. దీంతో బిల్లు ఆమోదం సందేహాస్పదంగా మారింది.