లాడెన్ని చంపేశారా? చచ్చిపోయాడా?
Published on: Fri Aug 31, 2012 3:14PM
ఒసామా బిన్ లాడెన్ ని యూఎస్ కమాండోలే చంపేశారా? లేక కమాండోలు లోపలికెళ్లేటప్పటికే లాడెన్ తనంతటతానుగా ప్రాణాలు తీసుకున్నాడా? లాడెన్ హతమైన తీరుగురించి ఇంటర్నేషనల్ మీడియాలో వచ్చిన కథనాల్ని చూసినవాళ్లందరికీ ఇలాంటి అనుమానాలు చాలా కలిగాయి. పెంటగాన్ వర్గాలు మాత్రం లాడెన్ ని తామే చంపామని భుజాలు చరుచుకున్నాయి. కానీ.. నాట్ యాన్ ఈజీ డే పేరుతో నేవీ సీల్ కమాండర్ రాసిన పుస్తకంలో లాడెన్ డెత్ విషయంలో అసలేం జరిగింది.. అన్న రహస్యాలున్నాయ్.. ఈ పుస్తకం ప్రచురితమైతే తమ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని భావించిన పెంటగాన్ వర్గాలు రచయితను మిలటరీ రహస్యాల్ని అమ్ముకున్న కేసుల్లో ఇరికిస్తామని బెదిరిస్తున్నారు. పుస్తకంలో అసలారోజు ఏం జరిగింది అన్నదానిగురించి రచయిత చాలా వివరాలు చెప్పాడు. తాము లాడెన్ బెడ్ రూమ్ లోకి ఎంటరయ్యేటప్పటికే ఒసామా చచ్చిపోయి ఉన్నాడంటూ రచయిత చేసిన వ్యాఖ్యల్ని యూఎస్ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటోంది. వడ్లగింజలో బియ్యపు గింజలాంటి నిజాన్ని బైటపెట్టినందుకు రచయితమీద కారాలు మిరియాలు నూరుతోంది.


