మంత్రి హరీష్ రావ్ వాహనంపై జరిమానా..!

 

డ్రైవింగ్ లైసెన్స్, ఆర్.సి లేకపోయినా, సిగ్నల్స్ జంప్ చేసినా, ట్రాఫిక్ పోలీసులు సామాన్యుడికి ఫైన్ వేస్తారు. ఈ రూల్స్ అందరికీ వర్తించవా, నిబంధనలు పాటించని ప్రజాప్రతినిధులను పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. సామాన్యులకు చుట్టం కాని చట్టం ప్రజా ప్రతినిధులకు మాత్రం చుట్టంగా ఎందుకు మారింది. ట్రాఫిక్ రూల్స్ బేఖాతరు చేస్తున్నా ఎందుకు వారిపై ఎటువంటి చర్యలు ఉండట్లేదు. తెలంగాణ లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతోపాటు ఇతర పార్టీల నేతలు కూడా నిబంధనలను ఉల్లంఘించారని సమాచారం.

అత్యధికంగా ఓవర్ స్పీడ్ కారణంగా ట్రాఫిక్ పోలీసులు ఫైన్ విధించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు వాహనం మీద తొమ్మిది వేల మూడు వందల పదిహేను రూపాయలు ఉందని సమాచారం. ఓవర్ స్పీడ్ వల్లే ఈ ఫైన్లు పడ్డాయని, కాకపోతే హరీశ్ రావు వాహనాల్లో లేని సమయంలోనే ఫైన్ పడింది అనీ, మంత్రి వాహనం కదా అని హరీశ్ రావు డ్రైవర్ నిబంధనలను పాటించకపోవడంతో భారీగా ఫైన్ పడినట్టు సమాచారం.

ఓ.ఆర్.ఆర్ పై నిత్యం వందలాది ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, ప్రజాప్రతినిధులు ఓ.ఆర్.ఆర్ పై నిబంధనలను పాటించట్లేదు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఓ.ఆర్.ఆర్ పై నిబంధనలను పాటించలేదు. రవాణాశాఖ మంత్రి కూడా నిబంధనలు పాటించకపోతే సామాన్యులు ఎందుకు పాటించాలన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.