TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

'కిరణ్ కాపు వ్యతిరేక ధోరణి వీడాలి'

Published on: Wed Jan 11, 2012 3:35PM

హైదరాబాద్: అధిష్టానంపై ఒత్తిడి పెంచి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, మంత్రి బొత్స సత్యనారాయణకు వాయిస్ లేకుండా చేశారని కాపునాడు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ముఖ్యమంత్రి కిరణ్ కాపు వ్యతిరేక ధోరణి వీడారని వారు హెచ్చరించారు.  పార్టీలోని తమ ముఖ్య నేతకు ఇలా వాయిస్ లేకుండా చేయడం సరికాదన్నారు. ఈ విషయాన్ని తాము అధిష్టానం దృష్టికి తీసుకు వెళతామని చెప్పారు. ముఖ్యమంత్రి చొరవ చూపి కాపులను బిసిలలో చేర్చేందుకు కృషి చేయాలని సూచించారు.

కాగా పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే విధంగా విభేదాలు ఉన్నాయనే వాదనలు ఉన్న విషయం తెలిసిందే.ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన బొత్సను లక్ష్యంగా చేసుకొని ఇటీవల ముఖ్యమంత్రి మద్యం సిండికేట్లపై దాడులు నిర్వహించారన్న ప్రచారం జరిగింది. అలాగే తాను సూచించిన వారికి కాకుండా తనపై అసంతృప్తిగా ఉన్న బొత్సకు పిసిసి చీఫ్ వచ్చినప్పటి నుండి కిరణ్ కూడా ఆయనపై గుర్రుగానే ఉన్నారు. అధిష్టానం వద్ద ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకునే వరకు కూడా వెళ్లినట్లు వార్తలు వచ్చాయి.