రేవంత్‌రెడ్డి దెబ్బతో కేసీఆర్‌కు మైండ్‌బ్లాంక్!.. గులాబీబాస్‌కు టీడీపీ రిటర్న్ గిఫ్ట్..
Published on: Sat Jul 3, 2021 2:09PM
రేవంత్‌రెడ్డికి పీసీసీ చీఫ్ ప్రకటించగానే కాంగ్రెస్ శ్రేణులు పండగ చేస్కుంటున్నాయి. ఊరూ-వాడ సంబరాలు హోరెత్తుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కోలాహలం నెలకొనగా.. ప్రగతిభవన్‌లో మాత్రం అంతా నిశబ్దం. జై రేవంతన్న నినాదాలు.. ప్రగతి భవన్ గోడల్లో రీసౌండ్ అవుతున్నాయట. గజ్వేల్ ఫామ్‌హౌజ్‌లోనూ ప్రకంపణలు వస్తున్నాయట. కొన్నిరోజులుగా కేసీఆర్‌లో ఉలిక్కిపాటు మొదలైందట. బీజీ రైజ్ అయిందట. చిటికీమాటికీ కోసం తెచ్చుకుంటున్నారట. గట్టిగా అరుస్తున్నారట. కరుస్తున్నారట. సరిగా నిద్ర కూడా పోవడం లేదట. ఇందులో నిజమెంతో గానీ.. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ కావడం మాత్రం కేసీఆర్‌కు మింగుడుపడని అంశమే. రేవంత్ పీసీసీ ప్రెసిడెంట్ కాకుండా తన కోవర్టులతో ఎంతగా అడ్డుకునేందుకు ప్రయత్నించినా.. ఆ పని గులాబీ బాస్ వల్ల కాలేదని అంటున్నారు. రేవంత్‌రెడ్డి పీసీసీ పగ్గాలు చేతబట్టి.. ప్రగతిభవన్‌పై దండయాత్రకు సిద్ధమైపోయారు. రేవంత్ కేకతో.. కేసీఆర్‌లో కాక పెరుగుతోందట. ఇంతకీ, గులాబీ బాస్ అంతలా టెన్షన్ పడటానికి కారణం ఏంటి? రేవంత్‌రెడ్డితో ఆయనకు గానీ, టీఆర్ఎస్‌కుగానీ జరిగే నష్టమేంటి?
లక్షలాది సైన్యం ఉన్నా.. ఒక్క సమర్థుడైన నాయకుడు లేకపోతే యుద్ధంలో గెలుపు అసాధ్యం. ఏడేళ్లుగా కాంగ్రెస్ పరిస్థితి అదే. నాయకుడైతే ఉన్నాడు కానీ.. కేసీఆర్‌ను ఢీకొట్టగల దమ్మున్న లీడర్ కొరత ఆ పార్టీని తీవ్రంగా వేధించింది. మూడున్నరేళ్ల క్రితం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో హస్తంపార్టీకి వెయ్యేనుగుల బలం వచ్చినట్టైంది. నేడు ఆయనకు ఏకంగా పీసీపీ కిరిటమే దక్కడంతో.. ఇక కేసీఆర్‌కు దబిడి దిబిడే అంటున్నారు.
టీఆర్ఎస్‌లో ఇప్పుడున్న నాయకుల్లో చాలామంది ఒకప్పటి టీడీపీ నేతలే. తెలంగాణలో టీడీపీ ప్రభ మసకబారడంతో.. ఓ వెలుగువెలిగిన లీడర్లను సైకిల్ మీద నుంచి దింపేసి.. కారెక్కించుకున్నారు కేసీఆర్. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో ఉన్న అప్పటి టీడీపీ నాయకులకు రేవంత్‌రెడ్డి పనితనం, సామర్థ్యం బాగా తెలుసు. ఇదే ఇప్పుడు కేసీఆర్‌లో కలవరపాటుకు కారణం అంటున్నారు. ఒకనాడు కేసీఆర్‌ను నమ్మి టీడీపీతో సహా వివిధ పార్టీల్లోని నేతలంతా ఎలాగైతే టీఆర్ఎస్‌లో చేరారో.. ఇప్పుడు అదే ఫార్ములా ప్రకారం రేవంత్‌రెడ్డి నాయకత్వంపై గురితో.. టీఆర్ఎస్‌లోని సంతృప్త, అసంతృప్తి నాయకులంతా తాజాగా రేవంత్ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి ఎప్పటికైనా సీఎం అవుతారనే అంచనాతో.. ఇప్పుడే ఆయన వెంట నడిస్తే.. రేపొద్దున్న అధికారంలోకి వస్తే.. తమను గుర్తుపెట్టుకొని మంచి పదవి ఇస్తారనే ఆశతోనైనా పలువురు టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ వైపు దృష్టి సారిస్తున్నారట. తమ ఫోన్లు ట్రాప్ అవుతున్నాయనే అనుమానంతో.. పలువురు టీఆర్ఎస్ నేతలు రేవంత్‌రెడ్డికి ఇప్పటికే వాట్సాప్ కాల్స్ చేసి విషెష్ చెప్పారని అంటున్నారు. పాత టీడీపీతో పాటు కొత్త టీఆర్ఎస్ నేతలు సైతం తాజాగా రేవంత్‌తో టచ్‌లోకి వచ్చారని సమాచారం.
అటు, తెలంగాణ రెడ్లతో పాటు హైదరాబాద్‌లో ఉండే సీమ రెడ్లు, వివిధ వర్గాల సీమాంధ్ర ప్రజలు సైతం రేవంత్‌రెడ్డికే అనుకూలంగా ఉన్నారనే టాక్ ఉంది. ఇటీవలి జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బొటాబొటి మెజార్టీతో గెలిచి బయటపడటానికి సెటిలర్స్ ఓట్లే కారణం. స్థానికులు అధికంగా ఉండే డివిజన్లలో బీజేపీ గెలిస్తే.. సీమాంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉన్న చోట్ల కారు పార్టీ దూసుకుపోయింది. రేవంత్‌రెడ్డి రాకతో ఈ ఈక్వేషన్ మారిపోతోంది. ఇటీవల రెండు రాష్ట్రాల జల వివాదం, ఏపీ ప్రజలను రాక్షసులంటూ మంత్రులు తిట్టడంతో.. ఆ ప్రాంత ప్రజలు ఆవేశంతో రగిలిపోతున్నారు. వారంతా కేసీఆర్‌కు అగెనెస్ట్‌గా రేవంత్‌రెడ్డి వైపు షిఫ్ట్ అవుతున్నారు. గ్రేటర్‌తో పాటు తెలంగాణ జిల్లాల్లోనూ టీడీపీకి ఇప్పటికీ చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉంది. బీసీల పార్టీగా పేరున్న టీడీపీ అభిమానులు తెలంగాణలో ఊరూరా ఉన్నారు. చంద్రబాబు అందించిన ఐటీ ఫలాలు ఆరగిస్తున్న వారంతా ఇప్పటికీ సీబీఎన్‌కు రుణపడే ఉన్నామంటారు. వారంతా.. ఇప్పుడు ఒకప్పటి టీడీపీ నాయకుడైన రేవంత్‌రెడ్డికి సపోర్టర్స్‌గా మారుతున్నారు. టీటీడీపీని తీవ్రంగా డ్యామేజ్ చేసిన కేసీఆర్‌కు.. నాయకులు, ఓటర్లు కలిసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.
ఇక, రేవంత్‌రెడ్డికి రెడ్ల సపోర్ట్ ఫుల్‌గా ఉంది. అన్ని పార్టీల్లో ఉన్న రెడ్డి నాయకులు రేవంత్‌రెడ్డిని తమవాడిగానే భావిస్తున్నారు. ఆయనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించేందుకు సిద్ధమైపోయారు. టీఆర్ఎస్‌కే రెడ్డి షాక్ గట్టిగా తగలనుంది. కేసీఆర్‌పై ఎప్పటినుంచో గుర్రుగా ఉన్నారు రెడ్డి నాయకులు. తమకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదంటూ చాలాకాలంగా అసంతృప్తితో రగిలిపోతున్నారు. రేవంత్‌రెడ్డి నాయకత్వానికి జై కొట్టేందుకు ఆలోచన చేస్తున్నారు. తెలంగాణలో గ్రామాలకు గ్రామాలనే ప్రభావితం చేయగల రెడ్డి నాయకులంతా ఏకమై రేవంత్‌రెడ్డికి మద్దతిస్తే.. టీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు భారీ గండి పడక తప్పదు. మరోవైపు, సీమాంధ్ర ప్రజలు, టీడీపీ అభిమానులు అంతా మూకుమ్మడిగా రేవంత్‌రెడ్డికే సపోర్ట్ చేస్తుండటంతో.. కేసీఆర్‌కు కంటి మీద కునుకు కరువైందని చెబుతున్నారు. ఆ మేరకు ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్టు ముఖ్యమంత్రికి చేరిందని.. అ నివేదిక చూశాక గులాబీ బాస్‌కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిందని అంటున్నారు. రేవంత్‌రెడ్డి దెబ్బా.. మజాకా....


