హస్తినకు బొత్స..మర్యాదపూర్వకంగానే
Published on: Sun Jan 29, 2012 9:06AM
హైద
రాబాద్: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సోమవారం ఢిల్లీ వెళ్తున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. సాయంత్రం ఆరు గంటలకు ప్రధానితో సమావేశం కావడానికి ఆయనకు అపాయింట్‌మెంట్ లభించింది. పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత బొత్స సత్యనారాయణ ఇప్పటి వరకు ప్రధానిని కలవలేదని, ఈ నేపథ్యంలో మన్మోహన్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకునేందుకే ఢిల్లీ వెళ్తున్నారని పార్టీ వర్గాలు వివరించాయి.


