TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కెమెరామాన్ ను పడేసిన సుందరి..!

Published on: Wed Dec 4, 2013 11:30AM

 

సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ అంటే తెలియనివారుండరు. తను చేసిన సినిమాలు ఒక అద్భుతం. దానికి "నాయకుడు", "గీతాంజలి", "సఖి", "ఖుషి", "ఇష్క్" వంటి సినిమాలే నిదర్శనం. అయితే పి.సి.శ్రీరామ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "మనోహరుడు" చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ఈ షూటింగ్ సమయంలో హీరోయిన్ అమీజాక్సన్ ను చూసిన శ్రీరామ్ కు తెగ నచ్చేసిందట. దాంతో ఆమె ఫోటోను పోస్ట్ చేస్తూ "అందానికి అత్యున్నత స్థానం" అని అంటూ అమీజాక్సన్ ను పొగిడేశాడు. ఈ సినిమా తన కెరీర్ లో పెద్ద హిట్టవుతుందని అమీ చాలా నమ్మకంగా ఉంది. ఈ సినిమా 2014లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.