TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఐపీఎల్ 2026.. చెన్నైసూపర్ కింగ్స్ కు వరుసగా రెండో ఓటమి

Published on: Fri Apr 3, 2026 11:34PM

ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం (ఏప్రిల్ 3) రాత్రి జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ పై సునాయాస విజయం సాధించింది.  టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన  చెన్నై సూపర్ కింగ్స్  నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది.

చెన్నై బ్యాటర్లలో . గైక్వాడ్  28 పరుగులు, ఆయూష్  73 పరుగులు,  దూబే  45, సర్ఫరాజ్ 32  రాణించారు.ఇక  పంజాబ్ బౌలర్లలో విజయ్ కుమార్ రెండు, బార్క్లెట్, జేసన్, చాహల్ తలో వికెట్ తీశారు. 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్  5 వికెట్ల తేడాతో గెలుపు సొంతం చేసుకుంది.   పంజాబ్ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.  

పంజాబ్  బ్యాటర్లలో ప్రియాన్ష్ ఆర్య 39,   ప్రభమన్ సింగ్  43 పరుగులతో రాణించగా, కీలక సమయంలో బ్యాటింగ్ కు వచ్చిన స్కిప్పర్ శ్రేయస్  అయ్యర్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు.  కనోలి 36 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2026లో చెన్నైకి ఇది వరుసగా రెండో ఓటమి కాగా,  పంజాబ్ కు ఇది వరుసగా రెండో విజయం.