TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

3. 22.359లక్షల కోట్లతో పయ్యావుల పద్దు

Published on: Fri Feb 28, 2025 9:34AM

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025-2026 ఆర్థిక సంవత్సరానికి 3లక్షల 22 వేల 359 కోట్ల రూపాయలతో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. రాష్ట్ర చరిత్రలో తొలి సారిగా బడ్జెట్ 3 లక్షల కోట్లు దాటింది. పయ్యావుల తన బడ్జెట్ లో సూపర్ సిక్స్ హామీలు, మేనిఫెస్టోలో పొందు పరిచిన పథకాలకు, అభిృద్ధికి పెద్ద పీట వేశారు. 

కాగా తన బడ్జెట్ లో రెవెన్యూ వ్యయం 2 లక్షల 51 వేల 162 కోట్లు కాగా, రెవెన్యూ లోటును 33 వేల 185 కోట్లుగా చూపారు. ఇక ద్రవ్య లోటు 79 వేల 926 కోట్ల రూపాయలు. మూల ధన వ్యయం 40 వేల 635 కోట్లు.