TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లోకేశ్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కావాలని కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారు : పయ్యావుల

Published on: Wed May 28, 2025 3:19PM

 

యువనేత లోకేశ్‌కు తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కావాలని టీడీపీ కార్యకర్తల నుంచి బలంగా డిమాండ్ వస్తోందని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. కడప మహానాడు’ ప్రాంగణంలో మంత్రి పయ్యావుల మాట్లాడుతూ… టీడీపీ కార్యకర్తలతో పాటు నేతలంతా ఈ డిమాండ్ నెరవేరాలని కోరుకుంటున్నారని చెప్పారు. లోకేశ్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కావాలన్నది ఇప్పుడు అత్యవసరం అన్నారు. పార్టీ మరింత బలోపేతం కావాలంటే ఇది సహేతుకమైన నిర్ణయమని పేర్కొన్నారు. పార్టీలో వినూత్న మార్పులకు మహానాడు ద్వారా శ్రీకారం చుట్టామని అన్నారు. 

నారా లోకేశ్ ప్రతిపాదించిన 6 శాసనాలు గేమ్ ఛేంజర్‌ కానున్నాయని తెలిపారు. తొలిరోజు మహానాడుకు అంచనాలకు మించి ప్రతినిధులు వచ్చారని చెప్పారు. మహానాడులో సాయంత్రం చేసే రాజకీయ తీర్మానానికి ప్రాధాన్యం ఉందని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు.లోకేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలన్నది నీడ్ ఆఫ్ ది అవర్ అని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ మరింత బలోపేతం కావాలంటే లోకేశ్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలన్నది సహేతుకమైన నిర్ణయమని తెలిపారు. అందరి అభిప్రాయాలకు అనుగుణంగా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు.