TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

వెనక్కి తగ్గిన పేటియం...

Published on: Fri Mar 10, 2017 1:42PM

 

క్రెడిట్‌ కార్డుల ద్వారా నగదు బదిలీపై రుసుం విధించాలని ప్రముఖ నగదు చెల్లింపుల మాధ్యమ సంస్థ పేటీయం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.  క్రెడిట్ కార్డు ద్వారా పేటీఎం వాలెట్ ను రీచార్జ్ చేసుకునే వినియోగదారులకు 2 శాతం ఛార్జీ విధిస్తామంటూ నిన్న పేటీఎం ప్రకటించింది.  చాలా మంది వినియోగదారులు క్రెడిట్ కార్డ్ ద్వారా పేటీఎం వాలెట్ లోకి డబ్బును ట్రాన్స్ ఫర్ చేసి, ఆ తర్వాత వారి బ్యాంక్ అకౌంట్లలోకి నగదును బదిలీ చేసుకుంటున్నారని... దీని వల్ల తాము నష్టపోతున్నామని, అందుకే 2 శాతం ఛార్జీ విధిస్తున్నట్టు పేటీఎం నిన్న తెలిపింది. అయితే నిర్ణయం తీసుకున్న కొన్ని గంటలకే యూటర్న్ తీసుకుంది. ‘వినియోగదారులు, వ్యాపారుల సౌకర్యమే మాకు మొదటి ప్రాధాన్యం. అందుకే 2శాతం రుసుమును రద్దు చేస్తున్నాం. కొందరు పేటీఎంను నగదు రొటేషన్‌ చేసేందుకు ఉపయోగిస్తున్నారని.. ఉచిత సౌకర్యాన్ని దుర్వినియోగం చేసే వారిపై చర్యలు తీసుకుంటాం’ అని అధికారులు తెలిపారు.