TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పాయకరావుపేటలో పాగా వేసేందుకు 'సుమన' ప్రయత్నం

Published on: Wed Mar 7, 2012 2:46PM

విశాఖపట్నం: విశాఖజిల్లా పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో పాగా వేసేందుకు మాజీ ఎమ్మెల్యే గంటెల సుమనా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావుపై స్పీకర్ అనర్హత వేటు వేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ టిక్కెట్ కోసం గంటెల సుమనా ప్రయత్నిస్తున్నారు. ఈ టిక్కెట్ విషయమై ఆమె ఇప్పటికే మంత్రి బాలరాజును పలుమార్లు కలుసుకున్నారు. అయితే ఆమె స్తానికురాలు కాకపోవడంతో టిక్కెట్ లభించడం కష్టమని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోట నగేష్ బహిరంగంగానే ప్రకటించారు. మంత్రి బాలరాజు నుంచి స్పష్టమైన హామీ లేకపోవడం, తోట నగేష్ తెగేసి చెప్పడంతో ఆమె హఠాత్తుగా అనకాపల్లి ఎంపి సబ్బం హరి కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. సబ్బం హరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతిపరుడుగా ఉన్నారు. సుమనా తాజా నిర్ణయం జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఒకింత గందరగోళాన్ని కలిగించింది. ఒకవైపు మంత్రి బాలరాజు ఆశీస్సులకోసం ప్రయత్నిస్తున్న సుమన ఇప్పుడు సబ్బం హరి ఆశీస్సులకోసం వెళ్ళడంలో అంతర్యమేమిటని పార్టీ వర్గాలు చర్చిస్తున్నాయి.