TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హస్తినలో పవన్ విందు.. భలే పసందు!

Published on: Thu Nov 28, 2024 1:39PM

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హస్తిన పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంతులతో భేటీ అయ్యారు. రాష్ట్ర సమస్యలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సాయం, సహకారంపై వారితో చర్చించారు. అనంతరం బుధవారం రాత్రి ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఎంపీలు, పలువురు కేంద్ర మంత్రులకూ ఢిల్లీ తాజ్ హోటల్ లో భారీ విందు ఇచ్చారు.

108 రకాల పూర్తి శాఖాహార వంటలతో ఆయన ఇచ్చిన విందు భలే పసందుగా ఉందని విందుకు హాజరైన కేంద్ర మంత్రులు, ఎంపీలు తెలిపారు. ఇటీవలి కాలంలో హిందూ ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మం గురించి ఎక్కువగా మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ ఢిల్లీలో తాను ఇచ్చిన విందులో కూడా 108 రకాల పదార్ధాలను వండించి వడ్డించారు. మహాభారతంలోనూ, భగవద్గీతలోనూ ఉన్నవి 108 అధ్యాయాలే కావడం ఇక్కడ గమనార్హం. అలాగే కార్తీక పవిత్ర మాసం కావడంతో పవన్ కల్యాణ్ తన విందును పూర్తి శాఖాహారానికే పరిమితం చేశారు. అలాగే ఈ సందర్భంగా ప్రధాని మోడీకి మద్దతుగా ఆయన బంగ్లా3దేశ్, పాలస్తీనా యుద్ధాల ప్రస్తావన తీసుకువచ్చారు. దీంతో పవన్ కల్యాణ్ విందులు జాతీయ మీడియా హైలైట్ చేసింది. విందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యాయి.