TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పవన్ అమావాస్య సెంటిమెంట్ బెడిసికొట్టిందా?

Published on: Sat Jul 26, 2025 2:47PM

2024 ఎన్నికల ముందు మంగళవారం, అమావాస్య నాడు రాజమండ్రి సెంట్రల్ జైల్ ముందు కూటమి పై కీలక ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్. అప్పట్లో అమావాస్య నాడు పవన్ చేసిన ఈ కూటమి ప్రకటనపై పులువురి నుంచి అభ్యంతరాలొచ్చాయి. కానీ ఫలితాల తర్వాత తేలింది ఏంటంటే పవన్ అమావాస్య సెంటిమెంట్ సూపర్ డూపర్ బంపర్ హిట్ అని.  పవన్ ఏమీ సెంటిమెంట్లు తెలీని వాడేమీ కాడని.. ఆయనకు కూడా జ్యోతిష సలహా సూచనలు ఇచ్చేవారు ఉన్నారని అంటారు. ఎవరో ఒక మహిళా జ్యోతిష్కురాలి సూచనల మేరకే పవన్.. వారాహీ అమ్మవారి కొలుపులు మొదలు పెట్టారనీ చెప్పుకొస్తారు. అంతే కాదు ఆయన తన వాహనానికి వారాహీ అని పేరు పెట్టడం ఆపై ఎన్నో యజ్ఞ యాగాలు చేయడం.. ఆ తర్వాత వారాహీ దీక్ష, సనాతన ధర్మ పరిరక్షణ.. అందులో భాగంగా భారీ ఎత్తున తీర్ధయాత్రలు, ఆపై తమిళనాడు మురుగన్ మానాడు వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుని చూస్తే పవన్ కి అమావాస్య పౌర్ణమి సెంటి మెంట్ల గురించి బాగా తెలుసనే చెప్పాల్సి ఉంటుంది.

ఇక్కడ మేటరేంటంటే జూలై 24న ఆషాడ అమావాస్య నాడు తన హరి హర వీరమల్లు రిలీజ్ ముహుర్తం ఫిక్స్ చేశారు పవన్. తాను గతంలో అమలు చేసిన అమావాస్య సెంటిమెంటు వర్కవుట్ అవుద్దని ఈ సారి కూడా ఫీలైనట్టు కనిపించింది. కానీ అదెందుకో ఎదురుకొట్టినట్టు కనిపిస్తోంది. రిలీజ్ వరకూ హైప్, పబ్లిసిటీ అంతా బాగానే ఉంది. ఎక్కడ తేడా కొట్టిందో అర్ధం కాక జుట్టు పీక్కుంటున్నారు కొందరు జన సైనికులు.

బేసిగ్గా అమావాస్య తెలుగు వారికి కలసి రాక పోయినా.. తమిళ సంప్రదాయంలో అవి అతి పెద్ద శుభకరమైన రోజు. వీరి లెక్కల ప్రకారం పౌర్ణమి చంద్రుడు నానాటికీ కరిగిపోతూ వస్తాడు. అదే అమావాస్య చంద్రుడు అంతకంతకూ ఎదుగుతాడు కాబట్టి.. ఎదుగుదల ఆశించేవారు అమావాస్య నియమాన్ని ఆచరించడం వల్ల ఎక్కువ మేలు జరుగుతుందని విశ్వసిస్తారు. తమిళనాట కూడా  అనుబంధం ఉన్న పవన్ ఈ దిశగా తన సెంటి మెంటు తొలి సారి విజయవంతం కావడంతో రెండో సారి కూడా ప్రయత్నించి చూశారు. అయితే ఇదేమంత  పని చేసినట్టు లేదు. దానికి తోడు పవన్ ఎంతో భక్తిగా కొలిచే వారాహీ అమ్మవారికి మరెంతో ఇష్టమైన నెల కూడా ఆషాడమే. అలాంటి ఆషాడ మాసంలోని పౌర్ణమిని   వదిలి అమావాస్య వెంట పడ్డారు పవన్. అందులో భాగంగా తన సినిమా హరిహరవీరమల్లు రిలీజ్ డేట్ ని ఆషాడ అమావాస్య రోజును మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయ్యారాయన. కట్ చేస్తే.. అది కూడా దారుణంగా దెబ్బ తీసినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం హరి హర వీరమల్లు పరిస్థితేంటంటే.. ఆ సినిమా చూసేందుకు థియేటర్లకు వెళ్లే వారే కరవయ్యారు. ఇక సినిమీలో ఆయన గుర్రం సీన్లు దారుణంగా ట్రోలవుతున్నాయి. ఇక హాళ్లలో జనం లేని క్లిప్పింగులెన్నో వైరలవుతున్నాయి. ఈ మొత్తం ఘోర పరాజయంతో ఒక ఫ్యామిలీ ప్యాక్ ఫ్లాప్ షో కంప్లీట్ అయినట్టు కొందరు దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ఆచార్య- భోళా శంకర్- మట్కా- గేమ్ ఛేంజర్- హరిహర వీరమల్లు.. ఇలా మెగా ఫ్యామిలీ మొత్తం వరుస డిజాస్టర్లు నమోదు చేయడంతో.. మెగా ఫ్యాన్స్ ఫుల్ డిజప్పాయింట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అత్తారింటికి దారేది తర్వాత సరైన హిట్టే లేని పవన్ కి.. తర్వాత వచ్చే ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి చిత్రాలే ఊపిరి పోయాలన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.